వికెట్ల వెనుక ధోని ఎంత వేగంగా కదులుతాడో మనందరికీ తెలిసిందే. వికెట్ల వెనుక ధోని ఉండగా క్రీజు దాటారంటే మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఐపీఎల్ టోర్నీలో భాగంగా పూణె వేదికగా బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ధోని మరోసారి తన కీపింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. <br />క్రీజులో చక్కటి పుట్ వర్క్‌ను కనబర్చే ఏబీ డివిలియర్స్‌ను ధోని తన స్టంపింగ్‌తో పెవిలియన్ చేర్చాడు. హర్భజన్ సింగ్ వేసిన 8 ఓవర్ మూడో బంతికి ఏబీ క్రీజు దాటి రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బ్యాట్‌కు తగలకుండా ధోని చేతిలో పడింది. ఇంకేముంది రెప్పపాటులో బంతిని ధోని వికెట్లను గిరాటేశాడు. <br />Royal Challengers Bangalore could not offer answers to the questions the spinners of Chennai Super Kings asked and were bundled out for 127/9 in 20 overs here on Saturday (May 5). <br />